Thursday, May 6, 2010
India's present Political Scenario
ప్రస్తుత మన రాజకీయ సమాజంలో రెండు రకాల వారున్నారు. వీళ్ళు మిడతల వంటి వారు .అవును.మిడతల లాంటి వారె. ఈ మిడతలు రెండు రకాలు.తెలివిగా ప్రవర్తించేవి.తెలివిగలవాటి మీద ఆధారపడి జీవించేవి.మొత్తానికి ఈ రెండు కలిపి ఒక వర్గం.ఈ వర్గం లో తెలివి గల రాజకీయ మిడతలు- బద్ధకపు మిదతల్ని అనుచరులుగా చేసుకుంటాయి. వేసవికలమంతా చీమ ఎండను లెక్కచేయకుండా కష్టపడి రాబోయే శీతాకాలం కోసం ఆహరం సమకుర్చుకుంటుంది.అది చూసి మిడత నవ్వుతు ఎగతాళి చేస్తుంది.జాలి పడుతుంది.వేసవి కాలాన్ని బద్ధకంగా గడుపుతుంది.
శీతాకాలం వస్తుంది.పుట్టలో చీమ వెచ్చగా ఉంటూ,తను దాచిన ఆహారాన్ని తింటూ,తన కష్టాన్ని,ముందు చూపునీ,తెలివినీ ఆనందంగా మార్చుకుని అనుభవిస్తూ ఉంటుంది . ఆకలితో అలమటిస్తున్న మిడత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి "మిగతా అందరు ఆకలికీ,చలికి అలమటిస్తుంటే కేవలం చీమే ఎందుకు ఇన్ని సౌఖ్యాలు అనుభవించాలి?" అని ఉద్యమం లేవదీస్తుంది. ఆటివి ,ఈటివి,మాటివి లాంటివన్నీ బుల్లితెరని సగానికి చీల్చి,వణుకుతున్న మిదతనీ,చీమ తళుకు భోజనం \టేబుల్ నీ చెరో వేఇపు చూపిస్తాయి.ప్రపంచం నిర్గంత పోతుంది.తర్వాత..............
చీమ ఉద్యమం లేవదీయగానే
సుధాశాట్ట్కర్ నిరాహార దీక్ష ప్రారంభిస్తుంది.చీమల పుట్ట ముందు అనసుయారాయ్ ధర్నా చేస్తుంది.C.B.I చేత ఎంక్వయిరీ చేయించమని కరుణానిధి కోరతాడు.జయలలిత వాకౌట్ చేస్తుంది.మిడతలకి ప్రాధమిక హక్కులివ్వాలంటూ పది మందికి మెసేజీలు పంపిస్తే బాబా ఆశిస్సులతో మంచి జరుగుతుందంటూ మెసేజిల వర్షం కురుస్తుంది.బీదవారికి జరిగే అన్యాయానికి నిరసనగా మాయావతి తన పార్టీ మద్దతు ఉపసంహరించుకున్తానని బెదిరిస్తుంది.ధనవంతులయిన చీమలకి,బీదవయిన మిడతలకి మధ్య వర్గ వ్యత్యస్సాన్ని తగ్గించేందుకు,ఎండాకాలంలో చీమలు పనిచెయ్యకుండా బిల్లు ప్రవేశపెట్టాలని కమ్యునిష్టులు డిమాండ్ చేస్తారు.విద్యా శాఖ మిడతలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది.తానూ అధికారంలోకి వస్తే మిడతలకి ఎల్లప్పుడూ ఫ్రీగా ఆహారం ఇస్తానని చంద్రబాబు వరలిస్తాడు.
Monday, March 22, 2010
Saturday, January 30, 2010
Subscribe to:
Posts (Atom)